🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 02 Oct, 2026 | Page: 1

గాంధీ భవన్ ముట్టడికి GO 317 బాధితుల యత్నం

హైదరాబాద్‌: GO 317తో ఇతర జిల్లాలు, జోన్లకు బదిలీ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా GO 190ను అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నిరసన నేపథ్యంలో గాంధీ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు.
🏠 Home