🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 20 Sep, 2026 | Page: 1

అటవీ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

–రెవెన్యూ అధికారులకు స్పష్టమైన సూచనలు.. పట్టాలు ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20: అటవీ భూముల విషయంలో రెవెన్యూ అధికారులకు అధికార పరిధి లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అటవీ భూములకు పట్టాలు జారీ చేయడం, వాటి విషయంలో రెవెన్యూ శాఖ జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి నుంచి ఒత్తిడి వచ్చినా అటవీ భూములకు పట్టాలు ఇవ్వడం చట్టబద్ధం కాదని పేర్కొంది.కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ మండలం రాజారాం గ్రామానికి చెందిన రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ విచారణ చేపట్టారు. తమకు పట్టాదారు పాస్‌బుక్‌లు, పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయని, తాము చాలాకాలంగా భూములను సాగు చేస్తున్నామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. అయితే అటవీశాఖ అధికారులు తమను భూముల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు.
అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చిన అంశాన్ని కోర్టు పరిశీలించింది. అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించడం లేదా ఆక్రమణలకు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అటవీ భూముల పరిరక్షణలో అటవీశాఖతో సమన్వయం తప్పనిసరని స్పష్టం చేసింది.
🏠 Home