🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 16 Sep, 2026 | Page: 1

బీఆర్ఎస్ పోరాట ఫలితమే.. మహాదేవపూర్‌కు తిరిగి గ్యాస్ ఏజెన్సీ

–పది రోజుల ప్రజల ఇబ్బందులకు పరిష్కారం

–నిరసనతో స్పందించిన అధికారులు.. తిరిగి గోదాముకు గ్యాస్ నిల్వలు.

–ప్రజల పక్షాన పోరాడి విజయం సాధించాం: బీఆర్ఎస్ శ్రేణులు.

మహాదేవపూర్: మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ తరలింపుతో పది రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ప్రజల సమస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో బుధవారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడంతో అధికారులు స్పందించారు. దీంతో గ్యాస్ ఏజెన్సీని తిరిగి మహాదేవపూర్ మండల కేంద్రానికి తరలించారు.బుధవారం గ్యాస్‌ను మహాదేవపూర్‌లోని గోదాముకు తరలించి భద్రపరిచారు. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మహాదేవపూర్ మండల కేంద్రంతో పాటు కాటారం సబ్‌డివిజన్‌లోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే గ్యాస్ సరఫరా అవుతుండటంతో ఏజెన్సీ తరలింపుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.తమ నాయకుడు పుట్ట మధు ఆదేశాలతో ప్రజల సమస్యపై స్పందించి, ఏజెన్సీని తిరిగి మహాదేవపూర్‌కు తీసుకురావడానికి పోరాటం చేశామని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు.గ్యాస్ ఏజెన్సీ సమస్యను నిరంతరం ప్రజల పక్షాన నిలబడి అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘భారత వాసి’ దినపత్రికకు బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రిక చేసిన కృషిని అభినందించారు. సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రజలకు, పత్రికా, ప్రసార మాధ్యమాలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ నాయకుడు పుట్ట మధుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కేదారి గీతా, మాజీ సర్పంచి శ్రీపతి బాబు, యూత్ నాయకుడు అలీమ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ కుమార్, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, రాజబాపు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home