🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 15 Sep, 2026 | Page: 1

అంబేద్కర్‌ను అవమానించే వ్యాఖ్యలపై నిరసన

హనుమకొండ : భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. హనుమకొండలోని అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌పై అవమానకరంగా మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు.
🏠 Home