🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 14 Sep, 2026 | Page: 1

బాలాలయంలో విఘ్నేశ్వరుడి కొలువు



కాలేశ్వరం:
గణపతి నవరాత్రుల సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ బాలాలయంలో సోమవారం విఘ్నేశ్వరుడి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అర్చకులు, వేదపండితులు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గణపతి విగ్రహాన్ని బాలాలయంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ఉప ప్రధాన అర్చకులు పనీంద్ర శర్మ ఆధ్వర్యంలో అభిషేకం, అలంకరణ, సంకల్ప పూజలు నిర్వహించి స్వామివారికి హారతి, నైవేద్యం సమర్పించారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు. గణపతి స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ, కార్యనిర్వహణ అధికారి ఎస్. మహేష్, సర్పంచ్ మోహన్ రెడ్డి, ధర్మకర్తలు సుంకరి సీతయ్య, శ్యాంసుందర్ దేవుడా, అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
🏠 Home