🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 14 Sep, 2026 | Page: 1

బైక్‌ను ఢీకొన్న బొలేరో.. ఇద్దరికి గాయాలు



భూపాలపల్లి:
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ ప్రధాన గేటు సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొర్లవీడుకు చెందిన కాటం సంపత్‌ (46), కాటం నరేష్‌ (26) బైక్‌పై గొర్లవీడు వెళ్తుండగా ఐడీఓసీ ప్రధాన గేటు సమీపంలో బైక్‌ను బొలేరో వాహనం (టీఎస్‌ 25టీ 7997) ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం వందపాడకల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.
🏠 Home