🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 14 Sep, 2026 | Page: 1

చిన్నారుల ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

కాటారం:
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బెల్లంకొండ కాలనీలో చిన్నారులు గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా కలిసి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఉదయం, సాయంత్రం వినాయకుడికి పూజలు, హారతులు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. చిన్నారుల ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతుండటంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్న వయసులోనే భక్తిభావంతో ఉత్సవాలను నిర్వహిస్తూ ఐక్యత, భక్తి, సంస్కృతిని చాటుతున్న చిన్నారులను స్థానికులు అభినందిస్తున్నారు.
🏠 Home