🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 14 Sep, 2026 | Page: 1

కాలుష్య నివారణకు మట్టి గణపతుల పంపిణీ

మహాదేవపూర్,: వినాయక చవితి సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రంలోని గ్రీన్‌వుడ్‌ కాన్సెప్ట్‌ ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు స్వయంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు.పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించకుండా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.
🏠 Home