🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 13 Sep, 2026 | Page: 1

విగ్రహం పూజకు…విత్తనం భవిష్యత్తుకు

విగ్రహం పూజకు…విత్తనం భవిష్యత్తుకు” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యం తో విత్తనాలతో రూపొందించిన మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందిస్తున్నట్లు హరిత సేన టీమ్ సభ్యులు ముస్కె లక్ష్మణ్ తెలిపారు..

భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి కి హరిత సేన సభ్యులు విత్తన గణపతి విగ్రహాన్నీ అందించారు..గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన విత్తన గణపతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు..ప్రతి ఒక్కరూ పర్యావరణహిత గణపతి విగ్రహాలను వినియోగించి, పచ్చదనం పెంపొందించేందుకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సుంకరి గోవర్ధన్, కొండపాక రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు..
🏠 Home