సెంటనరీ కాలనీలో అంబరాన్ని అంటే కృష్ణాష్టమి వేడుకలు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు.ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా 'ఉట్టి కొట్టే' సంబరాలు.రామగిరి మండలం సెంటినరీ కాలనీలో కృష్ణాష్టమి ఉత్సవాలు మార్మోగాయి. పన్నూర్ ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జోన్-1 దుర్గాదేవి ఆలయం వద్ద ప్రతిష్టాత్మకంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి కార్మికుల కుటుంబాలు, యువత పోటెత్తారు. సింగరేణి పిల్లలు ఉత్సాహంగా ఉట్టి కొట్టి సందడి చేశారు. భావితరాలకు మన సంస్కృతిని అందించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి స్పష్టం చేశారు. స్థానికులను ఏకతాటిపైకి తెస్తూ చేసిన ఈ వేడుకలు కాలనీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి."