🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 03 Sep, 2026 | Page: 1

గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

నల్లబెల్లి మండలం : మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, రికార్డులను ఆమె నిశితంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న అంశాలపై విద్యార్థినులను పలు ప్రశ్నలు అడిగి, వారి అభ్యాసన సామర్థ్యాలను స్వయంగా తెలుసుకున్నారు.ప్రతి విద్యార్థిని చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థినుల భవిష్యత్తుకు పటిష్టమైన పునాది పడేలా నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు.విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్:కళాశాలలోని వంట సామాగ్రి నిలువ గదిని పరిశీలించిన కలెక్టర్, పప్పు దినుసులు, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు. అనంతరం తయారు చేసిన వంటకాలను పరిశీలించి, విద్యార్థినులతో కలిసి ఆమె భోజనం చేశారు.వైద్య సదుపాయాలపై ఆరా:విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ విషయంలో రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. కళాశాల ఎఎన్ఎమ్ (ANM) వద్ద ఉన్న మందుల నిల్వలను పరిశీలించి, ఎల్లప్పుడూ నాణ్యమైన అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ పర్యటనలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి (DTDWO) నారాయణ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి (DBCWO) పుష్పలత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home