మృతుల కుటుంబాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పరామర్శ*
*మృతుల కుటుంబాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పరామర్శ*
మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రి మార్చురీ గదిలో ఉన్న రెండు మృతదేహాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర గుమ్మలకొండకు చెందిన వెంకటి లట్కారి, నాగులమ్మ అటవీ ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని మృతి చెందిన కృష్ణ చైతన్య మృతదేహాలను పరిశీలించి, ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జువాజీ తిరుపతి, తుంగల శ్రీజ, సంతోష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.